లఘున్యాసం (పురుషసూక్తముల) లో "పాపోఽహం పాపకర్మాహం పాపాత్మా" అని పలుకుతూ వుంటారు పూజలో, పాపోహం, నేను పాపిని, నాఆత్మ పాపము, నేను పాపకర్మలు చేస్తున్నాము అని అనుకోవటంలో యెంత బలహీనత వుంటుండాది? ఈపదములు, యీభావములు సాధకునకు ఉత్సాహప్రోత్సాహము అందించుటకు సరియైనవి కాదని తెలుసుకొనే భగవంతుడు అచ్యుతోహం, అనంతోహం, గోవిందోహం, సదాశివోహం అని బోధిస్తూ వచ్చాడు.
(శ్రీ.గీ.పూ.69)