అందరు భగవంతుని కోరువారే కాని భగవంతుడు శ్రద్ధాభక్తులను కోరుతాడు. మానవుడు తన చుట్టూ అల్లుకొనిన అసత్యమును భయమును అధిగమించ వలసి ఉన్నది. నిత్య సత్యములందు స్థిరముగా ఉండుట. ఇది ఒక్కటే మీ ముక్తికి మీ సంఘము యొక్క సంక్షేమమునకు అభయ మివ్వగలిగినది. అప్పుడప్పుడు మీరు కోరవలసిన అమూల్య పదార్థము డైమండు (వజ్రము) కాదు, డైమైండ్ (మనో నాశనము) తెలుసుకొండి.
(స.సా.మే77 పు.58)