ఈశ్వరార్పిరం చేస్తే మీ కార్యక్రమాలన్నీ పావనం కాగలవు. అన్ని కార్యకలాపాలకు భగవంతుడే ప్రేరకుడు. తగిన శక్తియుక్తులు ప్రసాదించి పనులు జరిపించేది ఆయన. పనులవల్ల కలిగే ఫలమును ఆస్వాదించే భోక్త ఆయన. అన్ని కర్మలకూ ఆయనే కారకుడు. సర్వమూ ఆయనదే. నాది అనేది లేనేలేదు అనే దృష్టితో చేసేకర్మ లన్నిటినీ ఆయనకు నివేదించే స్వభావం మీకు ఏర్పడాలి. మీరు నిర్వర్తించే సమస్త కార్యకలాపాలను నడిపించేవాడు ఆయనే అన్న విశ్వాసబలంతో పనులు చేయటమే మీవంతు. ,
(వ 1963 పు.154/155)