"దేహోదేవాలయః ప్రోక్తో జీవోదేవః సనాతనః" - దేహము ఆత్మకు ఒక దేవాలయము వంటిది. భగవంతుని ఊరేగించుటకు దేహము ఒక చక్కని రథము. రథము లేనిదే రథికుడుండుటకు వీలుకాదు.
చక్రములు లేని రధము
నీరెరువులు లేని పంట
చంద్రకళలు లేని రాత్రి
సింధూరము లేని గృహిణి
వెన్న తీసినట్టి పాలు
రుచి ప్రకాశము లెట్లు కలిగియుండు?
భక్తి లేని జీవితంబు
పుణ్యమా? పురుషార్థమా? అన్నట్లు
రథికుడు లేని రథముండుటకు వీలు లేదు. ఇటువంటి పవిత్ర మైన దేహమును మనము అలక్ష్యము చేసి దివ్యత్వమనే ఆత్మ తత్త్వము ఆధారముగా నున్నసత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నము చేయక కాలమును వ్యర్థము గావిస్తున్నాము.
(శ్రీ ది.పు.155/156)