సేవాదళంవారు, భక్తులు ప్రశాంతి నిలయానికి సుఖంగా వచ్చి చేరడానికి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలని సెంట్రల్ గవర్నమెంట్ 50 కోట్లు మంజూరు చేసింది. ప్రశాంతి నిలయం మెయిన్ రోడ్డు దాటిన తరువాత వచ్చే పెట్రోల్ బంక్ కు దగ్గర రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. పెనుకొండ, ప్రశాంతి నిలయం, ధర్మవరంలకు కనెక్షన్ ఇచ్చే రీతిగా రైళ్ళను ప్రారంభిస్తు న్నారు. రైల్వే డిపార్ట్ మెంట్ వారు మొన్న మీటింగ్ జరుపుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. స్వామి 75వ బర్త్ డేకే అందరూ వచ్చి ప్రశాంతి నిలయంలో దిగాలి. బొంబాయిలో ఎక్కవచ్చును. హైదరాబాద్ లో ఎక్కవచ్చును. ఎక్కడ ఎక్కినా ప్రశాంతి నిలయం చేరుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ మీకు ఎందుకోసం చెపుతున్నానంటే - అవతార సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అన్నీ జరిగిపోతుంటాయి.
(స.సా.ఫి.99 పు.36)