"రామచంద్రా! ఈ గంగానది భూమిపై దిగుటకు మీ పూర్వీకులే కారణము. వారి పుణ్యము, భూమిపై బుట్టిన మానవులు అందులో స్నానసంధ్యాదులాచరించి పునీతులగుచున్నారు. గంగానది పరమ పవిత్ర వాహిని. జన్మరాహిత్య మొనర్చు అమృత జలరూపిణి, శివుని జటాజూటమే ఈమె నివాసస్థానము. అందుచే ఈమె మంగళకారిణి. శుభదాయిని" అని అనేక రీతుల గంగను కొనియాడెను విశ్వామిత్రుడు.
(రా.ర.వా. మొ.భా. పుట. 100)
సకల సన్మంగళమునకును ఆనందమునకును గంగానది మూలమని రామచంద్రుడు నుడివెను.
(రా.ర.వా. మొ.భా. పుట. 260)
(చూ॥ సీత)