గణపతి అనగా గణమునకు అధిపతి. ఇహ పరములకు సంబంధించిన కర్మలను నిర్మూలం గావించేవాడు గణపతి. దశేంద్రియములకు, పంచ భూతములకు, పంచ కోశములకు అధిపతి గణపతి. ఏనుగు చాల తెలివైనది. కనుకనే, గజ తెలివి అనే పదం వాడుకలోకి వచ్చింది. వినాయకుడు మహా బుద్ధిశాలి యని, గొప్ప తెలివితేటలు కలిగినవాడని నిరూపించడానికే అతనికి ఏనుగు ముఖం పెట్టబడింది. సిద్ధి, బుద్ధి - ఈ రెండింటికి నాయకుడు వినాయకుడు. కనుక, మీకు సిద్ధి, బుద్ధి ప్రాప్తించాలంటే వినాయకుణ్ణి ప్రార్థించాలి. మీ తెలివితేటలను సద్వినియోగపర్చినప్పుడే మీరు వినాయకుణ్ణి పూజించిన వారవుతారు. మీ తెలివితేటలను దుర్వినియోగం చేయకూడదు.
(స.సా. న 99 పు. 288)
(చూ॥ గణపతి)