మనసును ఒక వస్తువుపై నిలుపుట. దీనిని యోగ శాస్త్రమునందు ధారణ మందురు. మనస్సు, మనోవృత్తులూ ఒక వస్తువుపై కదలక మెదలక కేంద్రీకరించిన స్థితి ధారణ అనబడును. ధారణ నుండియే ధ్యానము కుదురును. ధారణ యొక్క ముఖ్య లక్షణము ఆచంచలత్వము. దాని శక్తి, చంచలత్వమును నశింప జేయుట. దాని రూపము కదలిక ఉండుట. ఆనందమే దాని కారణము.
(ద్యా, వా, పు. 89)