జలము కూడా ప్రకృతిలో ఉండినటువంటిదే. ఇవన్ని దైవము యొక్క అనుభూతులే. ఆంశములే. ఆజలము చెబుతున్నది. "నాయనా నీవు కాలమునకు మార్పుచెందుతున్నావు. నేను ఎన్ని రీతులుగా మధురముగా, నిర్మలంగా ఉంటున్నాను. నాకు సహజమే యిది. నిర్మలత్వము నా స్వభావము. మాధుర్యము నా స్వరూపము. పవిత్రత నాకు సహజము. మూడింటిని నీవు అనుసరిస్తూ రా. శాంతము అత్యవసరము. అదియే నేను కోరుతున్నది. మనసులో మాధుర్యము, చల్లదనము పెంచుకో. దీనినే నేను three Ps అని చెప్పాను. purity, patience, perseverance అని. ఈ మూడింటిని నీవు సాధించు. ఆత్మ స్థానము. నీకు ప్రాప్తిస్తుంది అని బోధిస్తుంది జలము.
(ద.య.స.97 పు.63/64)