తామసము, కన్నులు కప్పించి ఆజ్ఞానము తెలివి తక్కువ,అజా గ్రత్త. నిద్రమత్తు, బద్ధకము, మాంద్యము మొదలగునవి తామసము యొక్క ఉపాధులయి తప్పుత్రోవలకు తీసుకొనిపోవుచుండును. తెలివిని లేదా జ్ఞానమును కప్పిపుచ్చి కనిపించుదానిని కనిపించనట్లు చేయును. దాని విక్షేపశక్తిని గొప్ప గొప్ప పండితులకూడను దాటలేరు. సరియైన తీర్మానమునకు రాలేరు. తామసము కలవాని మనస్సు అనేక శంకలతో నుండి అర్థముకాని భోగములందాసక్తి కలవాడై జ్ఞానము కోల్పోవుచుండును. అట్టి వారికి వారి ఆస్తి పాస్తి భార్యాబిడ్డలే. ఆత్మగా కనిపించుచుండును. అట్టి వారికి అసత్యము సత్యము గానూ, సత్యము అసత్యముగానూ కనిపించును.
(జ్ఞానా, పు. 16/17)