నియమాలు, నిబంధనలు, స్వయం కట్టుబాట్లు అనేవి ఆత్మ సాక్షాత్కారానికి బంగారు బాటలు, అవి నిన్ను కేవలము కట్టివేయటానికి కాదు. హద్దులో వుంచటానికికాదు. అందరికి ఆత్మ వున్నది. అయితే మనస్సు చలిస్తుంది: అశాంతి పాలవుతుంది. ఆ విధంగా మనస్సును కట్టి వేయటానికే యీ నియమ నిబంధనలు. చిన్నమొక్క చుట్టూ కంచెకడతాము ఎందుకని? పశువులు నాశనం చేయకుండా. కానీ ఆ మొక్క పెరిగి చెట్టుగా మారినపుడు నాశనము చేయటానికి వచ్చిన పశువులే ఆ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొంటాయి. నియమ నిబంధనలు అనేవి మనసుచుట్టూ వేసే కంచెలాంటివి.
(శ్రీస.ప్ర.పు. 116)