పంచ భూతాత్మకమగు ఈ చక్షువులు, పంచభూత సంబంధమైన వస్తువులను మాత్రమే చూడ గలవు. ఆ ప్రకాశ వస్తువులు యెంత ప్రకాశవంతమైన యెంత విలువైన సువర్ణ రత్నములనైననూ ప్రకాశింప చేయజాలవు. దీపము స్వప్రకాశమై తన్నుతాను, ఇతర వస్తువులను యెట్లు ప్రకాశింప చేయునో అటులనే భగవంతుడు స్వయం ప్రకాశకుడును, జ్ఞాన స్వరూపుడును, అప్రాకృతుడును అగుటచే అతనిని జ్ఞాన దృష్టిచే మాత్రమే చూడనగును. అట్టి జ్ఞాన దృష్టిచే కూడనూ స్వయముగా కలుగుట దుస్సాధ్యము, ఈశ్వరానుగ్రహము వలననే గలుగవలెను. అందువలన ఈశ్వరోపాసన అవసరము. అది లేనివారికి అన్నియూ లేనట్లే. తనను తాను చూడలేనివాడు ఇతరములను మాత్రమేమి చూడడలడు! ఈశ్వరాను గ్రహమును పొందల్గినట్టి సాధన చేసిన, జ్ఞాన నేత్రము తానే అందించగలడు! అతను భక్తసులభుడు.
(గీ.పు. 182)