నారదుడు ఒకానొక సమయములో విష్ణువుని సందర్శించి "స్వామి!నేను త్రికాలము లందు సంచరిస్తాను. ఈ లోక వార్తలు నీకారీతిగా అందించాలి. నీ Permanent Address ఏమిటి? ఇక్కడా, అక్కడా అని Branch Address లు ఇస్తావు. ఈ Branch Address లు నాకక్కరలేదు. అక్కడ ఉండవచ్చు లేకపోవచ్చును" అన్నాడు నారదుడు. అప్పుడు వెంటనే విష్ణువు చెప్పాడు నారదా! వ్రాసుకో నా అడ్రసు "మద్భక్తా యత్రగాయన్తి, తత్రతిష్టామి" నారదా: ఎక్కడ నా భక్తులు మధురమైన కంఠములతో నిర్మలమైన భావములలో నన్ను స్మరిస్తారో అదే నా పర్మనెంటు అడ్రస్. భగవంతుడు కైలాసవాసి.వైకుంఠవాసి, బదరీవాసి, కేదారవాసి" అని ఏమేమో చెప్పుతారు. ఇవన్నియు కేరాఫ్ అడ్రస్సులే. కాని డైరక్టు అడ్రస్సు హృదయమే. “ఈశ్వర సర్వభూతానాం " " ఈశావాస్య మిదం సర్వం " "వాసుదేవ సర్వ మిదం" ఎక్కడ చూచినా ఉన్నాడు కనుక, మన హృదయంలో కూడా, ఉన్నాడు. కనుకనే హృదయానికిఆత్మారాముడు అని పేరు వచ్చింది. ఆత్మ స్వరూపమును రమింప జేసినది కనుకనే "రామ" అనే పేరు.
(స.సా.జ.1989పు.146)
(చూ|| తరించటానికిఒక్కసూక్తిచాలు!)