ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తున్నారో మీరు గుర్తించాలి. వారు చెమటోడ్చి ఎంతో కష్టపడి సంపాదించి, వారు కడుపునిండా తినక, మిగిల్చి మీకు పంపిస్తుంటారు. వారు కష్టపడుతూ కూడా, మీకు సుఖాన్ని అందించాలని మీకు డబ్బు పంపురూ ఉంటారు. కనుక ప్రతి పైసా మన రక్తం బొట్టులో సమానంగా చూచుకోవాలి. మన బ్లడ్లు మన దుడ్డు, వేస్టు (వ్యర్థం)చేయకూడదు. నీ దుడ్డు అంతా కూడా నీ తల్లిదండ్రుల రక్తపు బొట్లే (బ్లడ్ డ్రాప్సే). అవసరమైన దానికే ఖర్చుచేయి! అమితంగా మాత్రం వ్యర్థం చేయకు!
ఈనాడు విద్యార్థులు కాలేజీ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎన్నకలలో గెలిచినతరువాత పిక్ నిక్ ల పేరుతో చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇది చాలా దుర్వినియోగం. ఇది ఏమాత్రం మంచిది కాదు. మీ భవిష్యత్తును గురించి కూడా కొంతయోచించాలి. తల్లిదండ్రుల పరిస్థితిని కూడా చింతించాలి. పంపుతున్నారు గదాయని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకూడదు.
Don t waste time.
Time waste is life waste.
Don t waste food.
Food is God.
Don t waste money.
Misuse of Money is Evil
Don t waste Energy.
Energy is God.
మన చూపు God మన వినికిడి. God, మన మాటలు.. మన వాసన God మన పమలు God. మనం అంతాదైవాన్ని Waste (వ్యర్ధం) చేస్తున్నాం . కనుక ఈ Energy (శక్తి) ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగ పెట్టుకుంటే, అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చును.
ఈ Energy (శక్తి)ని Waste (వృథా చేసుకోవటంచేతనే Energy (చెడు)గా మారి పోతున్నారు. పవిత్రమే (Purity)సర్వమునకు మూలకారణము.(శ్రీన.96.పు.51)