శాంరజీవనమునకు వాగ్దత్తము మరువకూడదు. మర్యాద కలిగి నిష్పక్షపాతబుద్ధితో నుండి భక్తి అను సముద్రమున మునిగియుండవలెను హిమవంతునివలె స్థిరముగ నుండవలెను. నీ హృదయ తోటనుండి లోభము, క్రోధము, అసూయ, స్వార్థము, దురాశ, అహంకారము, మమకారమను ముండ్ల చెట్లను తీసివేయవలెను. అట్టి మొలకలను పెరికి వేయవలెను. ఈ సాధనలు అన్నియుశాంతి భద్రత సాధనలే. నీవు సర్వ వ్యాప్తియైన, అమరత్వమైన ఆత్మనని మొదట నిర్ధారణ చేసికో, తదుపరి ఈ సాధనలన్నియు సులభముగా సాధించవచ్చును. అట్లు కాక దేహమే నేను. జీవినే నేను, ఇంద్రియములే నేనను భ్రమలో వుండి ఎన్ని సాధనలు చేసిననూ అవి ఫలించని పిందెలే, పండ్లు ఏనాటికీ కానేరవు. శాంతిని ఎన్ని జన్మములైనా నీవు అనుభవించలేవు. శాంతిని నీవు స్వరూపముగా నిరూపించదలచితివా నీవే శాంత స్వరూపుడని తెలిసికో దేహేంద్రియములు నేను కాదని త్యజించుము; వాసనలు దూరమగును. ఎప్పుడు వాసనలు దూరమగునో శాంతము యొక్క ప్రకాశము నీ కగుపడును.
(ప్రవాపు 32/33)