శాఖలనగా ఉపాంగాలు చెట్టుకు కొమ్మలుండినట్లు కొమ్మలకు రెమ్మలుండినట్లు ఈ కొమ్మ రెమ్మలలో కూడినదే వృక్షమైనట్లు, శాఖోపశాఖలతో కూడినది వేదము. ఇట్లు ఒక్కొక్క వేదమునకు అనేక శాఖోపశాఖలు ఉన్నవి. ఏవో కొన్నింటిని మాత్రమే కొందరు గుర్తించిరి. గుర్తించక ఆచరించక వదలిన శాఖలు కొన్నివేలు, కొందరు గుర్తించిరి. గుర్తించక ఆచరించక వదిలిన శాఖలు కొన్నివేలు లక్షలున్నవి. ఆసలు వాటి పేర్లు కూడా ఎవరికీ తెలియవు. కనుకనే అనంతో వై వేదః అన్నారు. ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క వేదములో కొన్ని కొన్ని వేదములో కొన్ని కొన్ని శాఖలను మాత్రమే గుర్తించి వల్లెవేస్తూ వచ్చారు.
(లీ.వా.పు. 10)