శాస్త్ర ప్రమాణము ననుసరించి - ఉత్సాహం, సాహసం, ధైర్యం, సద్భుద్ధి, శక్తి, పరాక్రమము - అను ఈ ఆరుసుగుణములు ఉండు చోటసాక్షాత్తు భగవానుడు నివసిస్తాడు. పిరకిపందలకు - ఆధ్యాత్మిక క్షేత్రమున చోటేలేదు. దుర్జనులు, దృఢవిశ్వాసము లేనివారు, సందేహస్తులు, ఏడుపుముఖము గలవారు - వైద్యులకు శిష్యులుగా ఉండవలసినవారేకానీ, అట్టి వారుయోగ్యులెన్నటికి కాలేరు.కానేరరు. జ్ఞానికి, - అజ్ఞానికి ఇదే భేదం. * ప్రహసన్నివ" - కృష్ణుడు ఆనందాతిరేకములతో నవ్వుతూ పలుకుట - అర్జునుడు దు:ఖాకులుడై వినుట - జ్ఞాని ఎల్లప్పుడు నవ్వుతాడు. అజ్ఞాని ఎల్లప్పుడు ఏడుస్తాడు.
(జ.పు.139/140)
(చూ|| పుణ్యఫలం)