“రాగతాళ సహితముగా గానము చేసే ప్రజ్ఞ కొందరికి పుట్టుకతోనే వస్తుంది. చేత కుంచె పట్టుకొని చిత్రములు వేస్తుంటే, జీవకళ ఉట్టిపడుతుంది. ఇట్టి ప్రతిభ, ప్రజ్ఞ కేవలం ప్రయత్నం ద్వారా సిద్దించునది కాదు. ఇది నిజంగా భగవంతుని అనుగ్రహం, వారి జన్మాంతరముల ప్రాప్తి ప్రయత్నములు కొంతవరకు మాత్రమే సహాయకారిగా ఉంటాయి. విత్తనమే లేకపోతే, ఫలించేదేముంది? విత్తనమనే ప్రాప్తి ఉన్నప్పుడే ఫలములు అందుకోవటానికి అవకాశముంటుంది. రాక్షసగుణము, త్యాగభావములు కూడా జన్మాంతర ఫలములే. మన తలంపులననుసరించియే మరు జన్మమనేది ప్రాప్తిస్తుంది.” బాబా (సాలీత పు146)