యోగ వాశిష్ఠములో, "రామా! మహాసముద్రమునైనా సులభముగా పానము చేయవచ్చు. సుమారు పర్వతములనైనను. అవలీలగా ఊడ పెరకవచ్చు. అగ్నిని అనాయాసముగా భుజించవచ్చు. కాని మనో నిగ్రహము చాల కష్టమని" అన్నాడు వశిష్టుడు, కాన ఒక పరి మనోనిగ్రహమును గావించితిమా అదే అమృతత్వము. అట్టి అమృతత్వమును పొందుటకు పూర్వము అతి శ్రమ అనక మనోనిగ్రహమునకై ప్రయత్నించుట ప్రధాన సుఖము. ఇది ప్రధమ సుఖము.
(వి.వా.పు.51)