ఈ మాంస భక్షణ ఆరోగ్యమునకు మంచిదని డాక్టర్సు చెపుతారు. కానీ యిది అనేక రకములైన అనారోగ్యములకు మూలకారణము.
జైసే ఆన్ ఐసేమన్ ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు అని అంటారు. ఎలాంటి విత్తనమో అలాంటిమొక్క! ఎటువంటి, తిండోఅటువంటి త్రేపు. ఎటువంటి పిండో అటువంటి రొట్టె. అయితే మనము తినేది ఎట్లా ఉండాలి? మాంసాహార మనగా మృగముల యొక్క మాంసము. ఒక గొర్రె మాంసము తిన్నాడనుకోండి. వానికి గొర్రె బుద్ధులే వస్తాయి. అందువలననే మనలో నేడు కొన్ని గొర్రెలు అరుస్తున్నాయి. కొన్ని కోళ్ళు కూస్తున్నాయి. కొన్ని మేకలరుస్తున్నాయి. అందువలననే వేమన చెప్పాడు "కుక్క తిన్నవాడు గురుజంగ లింగము. పంది తిన్నవాడు పరమయోగి"అని పంది తామసమునకు ప్రతీక. దానిని తిని జీర్ణించుకున్నవాడు నిజముగా యోగి. ఈ పద్యములో ఎంతో అర్థము నందించాడు. మనము యే మృగము యొక్క మాంసమును తింటామో, దాని బుద్దులే మనకు వస్తాయి. కనుక ఈ మాంసాహారమును కొంతవరకు మానుకొనుట మంచిది.
(శ్రీ.ది.పు.96)