సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అను మంత్రములో చెప్పబడిన బ్రహ్మ ఈ ఆనంద స్వరూపుడు. ఆనందం బ్రహ్మ, బ్రహ్మ సత్య స్వరూపుడు. బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. బ్రహ్మ అనంత స్వరూపుడు. కనుక సర్వమును ఆనందమునకు నిర్వచనములే కాని అన్యము కాదు. పరిఛ్ఛేద మనబడు అల్పత్వము లేనిది ఆనందము. దేశ, కాల, ప్రాంతములకు లొంగునది కాదు ఆనందము. ఆనందమునందు దేశము, కాలము, పాత్రము పరిపూర్ణమై యుండును. ఆనందమునకు లోబడినవే దేశ కాల పాత్రములు కానీ, ఆనందము దేశ కాల పాత్రములకు లొంగినది కాదు, కట్టుబడినది కాదు. కనుక మంత్రముల చేత వర్ణింపబడిన భగవంతుడు, మంత్రములకు కట్టుబడునే కాని, తాము మంత్రములను కట్టివేయడు. రెండింటిని కట్టివేయునదే ఆనందము.
(సూ.వాపు.48/49)