స్వార్థ అహంకారములను తొలగించుకొని, దివ్వత్వాన్ని చేరుకోండి! సామాన్యభక్తి మంచి అనన్య భక్తికి చేరుకోవటానికి ప్రయత్నించండి! మొగ్గవిచ్చి, పరిమళాన్ని వెదజల్లినట్లుగ, మనసు వికసించి, విశాలమై సత్యసహన శాంతి ప్రేమ పరిమళాలను వెదజల్లాలి. దుర్గుణ నాశనం, పవిత్ర పోషణల ద్వారా హృదయ కమలము వికసించి "ముక్తిఫలం’’ లభిస్తుంది.
(సా.లీ. త..పు.9)