ప్రపంచమంతా ఈనాడు దుఃఖముతో నిండియున్నది. శాంతి ఎచ్చటనూ కనిపించుటలేదు. అన్యాయ, అక్రమ, అనిత్యములు అన్ని దేశములందు తాండవించుచున్నవి. లోకమంతా వ్యాపించి ప్రపంచమంతా పీడించుచున్న మనోవ్యధలకు ముఖ్యకారణము మానవులు కోరేదొకటి సాధించేది మరొకటిగా ఉండుటమే.
(సా.ముందుమాట)