ముఖ్యంగా లీడరు రెండు లక్షణాలుండాలి. ఒకటిఇండివిజువల్ క్యారక్టర్, రెండవది నేషనల్ క్యారక్టర్.స్వాతంత్య్ర సమరధులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్,లోకమాన్య బాలగంగాధర్ తిలక్, సర్దార్ వల్లభభాయి పటేల్ మున్నగువారిని ఈ లక్షణాలు కల్గిన నాయకులుగా పేర్కొనవచ్చు. ఈ నాడు లీడర్స్ లో ఇవి లోపించడం వలన అక్రమాలు, అరాచకాలు, అవినీతి విజృంభిస్తున్నాయి. ఇండివిజువల్ క్యారెక్టర్ లోపించినవానిని లీడర్ అనడానికి వీల్లేదు. లీడర్ అనే వాడు ముందుండి నడిపించేవాడుగా ఉండాలిగాని, వెనుక నుండి త్రో సేవానిగా ఉండకూడదు. సేవకుడే నాయకుడు. జితేంద్రియుడే యతీంద్రుడు. కింకరుడు కానివాడు శంకరుడు కాలేడు. లీడర్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది మరొకటుంది. First be then do, and tell. మంచిగా ఉండి, మంచిని చేస్తూ మంచిని చెప్పేవాడే సరియైన లీడర్. దీనినే నేను అప్పుడప్పుడు పిల్లలకు చెపుతుంటాను: Be good, do good, See good.
(స.సా.ఫ.99పు.53/54)
(చూ॥ ఈశ్వరాంబ,దేశాభివృద్ధి, వినాయకుడు)