పొయ్యిమీది గిన్నెలో పాలు పొంగుతుంటే చల్లని నీళ్ళు జల్లుతారు. అది వెంటనే తగ్గిపోయి గిన్నెలో సర్దుకుంటుంది. పొంగిపోయే పాలు దుర్వాసుడు. పాంగిపోని పాలు నారదుడు. నాలుకమీద నిరంతరమూ భగవన్నామం నాట్యం చేస్తున్నందువల్ల నారదుడు ఇంద్రియాలకు వశుడై పోలేదు, మీ ఇంద్రియాలనూ కోరికలను అదుపు చేసుకుంటే మీరిక్కడికి వచ్చి ఈ ప్రసంగాలు విన్నందుకు సత్ఫలితం కలిగినట్లు. నిజమైన బలమూ, సంతోషమూ అందించగల సవ్య మార్గంలో మీరు నడకసాగిస్తే నేను ఆనందిస్తాను.
(వ. 1963. పు. 28)
(చూ॥ ఆనందము, తుంగభద్ర, పాదం, భక్తుడు, భగవంతుడు, మంచివాడు, వాల్మీకి)