ఉపనిషత్తులలో ఉరుము "దదధ" అన్నట్లు వర్ణించారు. రాక్షసులకు దమము - దేవతలకు దయ - మానవులకు ధర్మము. ఈ మూడు అంశాలు నరులలో ఉన్నవి. కాబట్టి - దయ - దమము - ధర్మము నరులు అలవరుచుకోవాలి. భగవన్నామం స్మరిస్తూ - నీరసమైన పేలవమైన విషయాలలో నాలుకా భగవంతుని వైభవాన్ని మనస్సులో భావిస్తూ మనస్సు చారబడకుండా అరికట్టి, నిజతత్వం గ్రహించడమే మీ ప్రథమకర్తవ్యం.
(త.శ.మ.పు.147)