ప్రతివ్యక్తి సంకుచిత భావంతో సాయి కుటుంబమనే పదాన్ని ప్రయోగిస్తున్నారు.
"సాయికుటుంబ సోదరీ సోదరులారా" అని సంబోధిస్తున్నారు. మన్ముందు సాయి కుటుంబమనే పదంలో సాయి అనే మాట ఉపయోగించకండి. అందరూ మానవకుటుంబమే. ఒకరికి సాయి ఇష్టమైతే మరొకరికి రాముడంటే ఇష్టముండవచ్చును. ఇంకొకరికి కృష్ణుడంటే ఇష్టముండవచ్చును. ఈ సమావేశంలో అనేక అభిరుచులతో ఉన్న వారున్నారు. నాలో అట్టి సంకుచిత భావాలు లేవు.
(స. సా.డి.85 పు.322)