1. అభయము, 2.చిత్తశుద్ధి, 3. జ్ఞానయోగ మందుండుట, 4.దానము, 5. దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), 6. యజ్ఞము, 7.ఆధ్యయనము. 8. తపస్సు, 9. కపటము లేకుండుట, 10. అహింస, 11. సత్యము, 12. ఆక్రోధము, 13. త్యాగము, 14, శాంతి, 15. కొండెములు చెప్పకుండుట, 16. సమస్త ప్రాణులయెడ కరుణ, 17. విషయములందు మనస్సు పోకుండుట, 18. తేజెస్సు 19. క్షమ, (ద్వంద్వములను సహించుట) 20. ఆపత్కాలము నందు సహిపము ధైర్యమును విడువకుండుట, 21 శౌచము, 22. పరులకు ద్రోహము చేయకుండుట 23. మృదు స్వభావము (వాక్ మాధుర్యము). 24.ధర్మ విరుద్ధ కార్యములలో ప్రవేశించకుండుట, 25. చంచల స్వభావము లేకుండుట. ఇట్టి పవిత్రమైన ఇరువది అయిదు గుణములు కలవారినే దైవ సంపత్తవియును, డంబము, గర్వము, దురభిమానము. కోపము, పరులను పీడించేలాగున వంచించు స్వభావము, వివేక జ్ఞానహీనత, ఇత్యాది దుర్గుణములు కలవారలను దానవాంశమనియును, అందురు. ఆకారమున మానవులవలె కనుపించునంత మాత్రమున మానవులు కానేరరు."
(గీ.పు.226)
(చూ|| ప్రమాదము)