1) ఎండమావులెంత పారినా తడవనట్లు శ్రద్ధలేకున్న కర్మలెన్ని చేసినను చిత్తశుద్ధి కలుగదు.
2) ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగునో అదియే వైకుంఠం.
3) ఏకాంతమనగా ఎవరిచేతనూ బాధ కలుగకుండా ఉండునట్టి స్థలము.
4) ఏకాకి అనగా రెండవవారు లేకుండుట.
5) ఏడ్చేవాడు నరుడు. నవ్వేవాడు నారాయణుడు,
6) ఐహిక సంబంధమునకు మాయయే కారణము.
7) ఓర్పే మానవునకు సర్వబలము.
8) కరిగే ఆయుస్సు, కదిలే జలము తిరిగిరావు.
9) కర్తవ్యపాలనయే ధర్మం ,
10) ధర్మబద్ధమైన జీవితమే సత్ ప్రవర్తన.
11)కర్మజిజ్ఞాస ఉంటే, ధర్మజిజ్ఞాస ఉంటుంది. ధర్మజిజ్ఞానఉంటే బ్రహ్మజిజ్ఞాస అనుభవింపగలం.
12) కర్మసంబంధి జీవుడు. భక్తి సంబంధి దేవుడు.
13) ఎల్లడ భగవంతుడున్నాడని విశ్వసించితే, ఎందెందు వెదకి చూచిన భగవంతుడు అందందే కానవచ్చును.
(స.సా. మే. 91 పు. 138)