"సత్యసాయి సమస్త మానవులకు హృదయస్థసాయి అయ్యేఈ నూతన సత్యసాయి శకారంభమును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. మానవజాతి నంతటినీ ఒకే కుటుంబముగా ఏకము చేసి మీలో ప్రతి ఒక్కరిలో ఆత్మసత్యమును స్థిరముగా నెలకొల్పి ప్రకాశింప చేయటానికి నేను అవతరించాను. ఇదే మీ అందరికీ సాయి యొక్క సందేశము: నవయుగానికి వైతాళికులు కండి! స్వార్థము, దురాశ, ద్వేషము హింసలను వదలి పెట్టండి. మీకు మీరు జ్యోతి స్వరూపులుగా ఉండండి: ఇతరులకు వెలుగుబాటను చూపించండి...
(వై.పు.323)