మీరు అన్ని విధములైన దినపత్రికలు చదువుతుంటారు. అందుకోసమే చెప్పవలసి వస్తున్నది. మా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అనేది ఆగ్నితో కూడా కాలదు. అంత పవిత్రమైనది. ఇందులోని ప్రతి నయాపైసను ఎంత పవిత్రమైన రీతిలో ఉపయోగపడుతున్నామో మాకు తెలుసుకాని, జగత్తుకు తెలియదు. సెంట్రల్ ట్ర స్ట్
మ్ంబర్సంతా 20 సం॥ల నుండి నిస్వార్థ మైన సేవ చేస్తున్నారు. ఎక్కడైనా ఢిల్లీలోనో, మద్రాసులోనో, బొంబాయిలోనో పని పడిందంటే వారు తమ స్వంత ఖర్చులతో వెళ్ళి వస్తారు కాని, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ని నయా పైసను కూడా ముట్టరు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వారు ఇంత పవిత్రంగా దీనినిఉపయోగపడుతున్నారు. కాని, వారు. ఏవో పదవుల కోసం పాటుపడుతున్నారని ఈనాడు ప్రచారం జరుగుతోంది. వారికెట్టి పదవులు అక్కరలేదు. వారికి పదవులు ఏమైనా తక్కువనా? వారు పదవుల నాశించి వచ్చిన వారు కాదు, స్వామి ప్రేమనాశించి వచ్చినవారే! ఇంక ట్రస్టుకు సంబంధించి బ్యాంకు నుండి మేము డబ్బు డ్రా చేస్తున్న విధానమును కూడా మీరు చక్కగా గుర్తించాలి. ఇరువది సంవత్సరాల నుండి బ్యాంకు ద్వారా డబ్బు (Cash) ఒక్క దినమైనా తీయలేదు. ప్రతి ఒక్కటి చెక్కుల ద్వారానే జరుగుతుంది. మా ఇప్టిట్యూట్ టీచర్స్ జీతాలు కూడా ప్రతి నెల బ్యాంకులో వారివారి అక్కౌంట్స్ కే పంపుతుంటారు. ఇంత Strictగా మేము ఉంటున్నాము, ఇంత పవిత్రంగా వినియోగిస్తున్నాము. మేము ఎవ్వరిని ఆశించనక్కరలేదు. ఆశించటం లేదు. ఈ శరీరమునకు ఇప్పుడు 67 సంవత్సరములు. ఏక్షణములోను నేను చేయిజాపి ఎవ్వరినీ అడగలేదు. పవిత్రమైన కార్యము చేయాలంటే మనం ఎవ్వరినీ ఆశించ నక్కర లేదు. మన పవిత్రతే దానిని తెప్పిస్తున్నది. ఈ నాడు మంచి కార్యాలు చేసే వ్యక్తులు లేకపోతున్నారు కాని, నిజంగా చేసే వ్యక్తులే ఉంటే డబ్బుకే మాత్రం కొదువలేదు.
మేము ఒక్క నయా పైస కూడా దుర్వినియోగం చేయటం లేదు. పోనీ వేరొకరెవరైనా మా డబ్బును డ్రా చేస్తున్నారనుకుంటే - మా ట్రస్టులో అట్టి అవకాశమే లేదు. ప్రతి దానికి రెండు సంతకాలు పెట్టాలి. ప్రతి చెక్కులో నా సంతకం ఉండాలి, లేకుండా ఎవ్వరూతీసుకోవడానికి వీలులేదు. "ట్రస్టుకి ఎన్నో కోట్ల - రూపాయలు వచ్చాయి. అంతా తినే సారు" అనిఅనుకొంటున్నారు. ఇది చాలా శుద్ధ అబద్ధము. Cash (డబ్బు) ను మేము ముట్టటమే లేదు. ఎవరైనా ఆంతోఇంత ఇస్తున్నారంటే వారి ఇంటికే మా ట్రస్టువారు, - బ్యాంకు మేనేజర్ వెళ్ళి వారి ద్వారానే బ్యాంకులో జమకడుతున్నారు. ఈ విషయములో ఎవ్వరూ వేలెత్తి చూపడానికి వీలే లేదు. ఇలాంటి పరిస్థితిలో సెంట్రల్ట్రస్టు గురించి దుష్ప్రచారం చేయటం మహాపాపం. జగత్తులో ఎక్కడ విచారించినా ఇంత పవిత్రముగా ధనము వినియోగము జరగటం లేదు. కనుకనే, మా సంస్థ దినదినాభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడే కాదు, సూర్య చంద్రాదులున్నంతవరకు మా సంస్థకు ఏమాత్రం దెబ్బలేదు. ప్రశాంతంగా ఉండిన ఈ ప్రంచంలో అసూయాపరులు తమ ప్రచారముల చేత ఆశాంతిని చెలరేపి లేని పాపాలను మూటకట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. చేతనైతే ఉపకారం చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అపకారం చేయకుండా ఉండటమే పెద్ద ఉపకారము.
ఐతే, ఇంతకాలం స్వామి దీనికి తగినటు వంటి జవాబు లివ్వలేదెందుకని ఊహించవచ్చును. ప్రతిదానికి ఒక సమయం రావాలి. కౌరవులు పాండవులను అనేక విధాలుగా బాధిస్తూ వచ్చారు. అవమానిస్తూ వచ్చారు. పాండవులలో ఒక్కొక్కరి యందు ఎంతో ఘనమైన శక్తులు ఉండినవి. కాని, వారు తమ శక్తులను ఏమాత్రం ఉపయోగ పెట్టక మౌనం వహిస్తూ వచ్చారు. కానీ, ఆ మౌనాన్ని కౌరవులు పిరికితనమని భావించారు. కాదు, కాదు. సహనంలో ఉన్న మహత్తరమైన శక్తిని ఎవ్వరూ గుర్తించ లేరు. కనుకనే మా సత్యసాయి ట్రస్టు సహనంలో అంతటినీ భరించుతూ వచ్చింది. అనునయించుకొంటూ వచ్చింది. ఈ సహనమే సర్వస్వము. " క్ష మ సత్యము, క్షమ, ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్ష మ సర్వస్వము",ఈ క్షమలో ఉండే శక్తిని ఎవ్వరూ గుర్తించటానికి వీలు కాదు.
(స.సా.జూలై 1993 పు.172/173)