ఈ ప్రపంచములో ప్రేమ సాధించలేనిది ఏదీ లేదు. కఠినమైన - గండశిలలను కూడా అది కరిగించగలదు. ప్రతి ఒక్కరిలో నుండే ప్రేమ తత్త్వమును ఏకోన్ముఖము చేయగలిగితే, అది విశ్వవ్యాప్తమైన ప్రేమగా రూపొందుతుంది. మీరు ప్రేమార్తిని తీర్చుకోవాలనుకుంటున్నారా? అయితే - భగవదనుగ్రహముకొరకు ఆర్తితో ప్రార్థించండి. దివ్యానందమును పొందాలంటే అంతకంతకు ప్రేమను పెంచుకుంటూపోండి. ప్రేమను ఎంతగా అభివృద్ధి చేసుకోగలిగితే అంతగా మీరు దివ్యానందమును అనుభవించగలరు ప్రేమలేకుండా దివ్యానందము లభించదు. నిజం చెప్పాలంటే, ప్రేమయే -దివ్యానందముగా రూపొందుతుంది” అని స్వామి చెపుతారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు28)