నిజమే మీకు నేనే షిర్డి సాయిబాబా అని తెలియుట కష్టమే. ఇటీవల బెంగుళూరు రోడ్డులో బాగేపల్లి అనుచోట వెంకటరామన్ అను ఆయన బిడ్డకు (సుధా అని పేరుగల బాలికకు) జబ్బు చేసినపుడు, నేను ముసలివాని వేషమునజోడి ఆదిపల్లె సోమప్ప అను పేరున కనబడి ఆ బిడ్డప్రాణము రక్షించితిని. వెంకట్రామన్ నా విషయము పూర్తిగా తెలిసినవాడయ్యాను, మారువేషములో నున్న నన్ను గుర్తింపలేకపోయె గదా! ఇప్పటి మారురూపమున నున్న నన్ను షిర్డిబాబాయే అని యెట్లు సామాన్యులు తెలియగలరు? ఒకే పరమాత్మ యొక్క అవతారములే కదా రాముడును, కృష్ణుడును. వారి యొక్క రూప నామములు, గుణకర్మలు కొంత భేదముగ నుండె. అందువలన సామాన్య ప్రజలు భేదము నెంచిరి కదాఇకఈసాయిరాం శరీరమునకు భేదము నెట్లు ఎంచక యుందురు? షిర్డిబాబా భక్తులు ఆయనను పరిపూర్ణముగా గ్రహింపలేదు. అట్లే మీరు నన్ను పూర్ణముగా తెలిసికొనియుండలేదు. మమ్ముల నిరువురిని బాగుగా నెరిగిననే ఇరువురు ఒక్కటేనని దృఢముగా చెప్పగలరు.
(స.శి.సు.ప్ర.పు.243)
(చూ॥ విజయదశిమి)