జ్యోతిష్య శాస్త్రము ప్రకారము నిర్ణయించే భవిష్యద్విషయములలో ఒకదానికింకొక దానికి పొంతన ఉండదు. ఇది కొంత వరకు పొరపాటుకు దారితీస్తుంది. కాలమును కచ్చితముగా గుణించడము కష్టము. ఇది పొరపాట్లకు దారితీస్తుంది. జ్యోతిష్యము గ్రహములను ఒక కోణములో నుంచి మాత్రమే చూడగలుగుతున్నది. గ్రహములను సంపూర్ణముగా వీక్షించలేకపోవడము పొరపాట్లకు మూలము. సృష్టిలో ప్రతివోక్కటి మార్పు చెందును. మనుష్యులు మార్పు చెందుతారు. అట్లాగే గ్రహముల కూడా, జ్యోతిష్యులు ఈ మార్పులను పరిగణించరు. ఇది పొరపాట్లకు దారితీస్తుంది. జ్యోతిష్కులకు శాస్త్రములపై సరియైన అవగాహనుండదు. అందువలన అనేక పొరపాట్లు జరుగుతాయి. జ్యోతిష్కులు పవిత్రమైన జీవితములను గడుపకపోవుటచే వారికి ఆధ్యాత్మికపరమైన సహాయము అందుబాటులో ఉండడము లేదు. ఇది కొన్ని పొరపాట్లకు దారితీస్తున్నది. ఇన్ని పొరపాట్లు జరుగుచున్నందు వలన జ్యోతిష్యము ఆధారపడదగినది కాదు. దానిని గురించిన ఆలోచన వ్యర్థము.
(ప.ప్ర పు.33)