"తనలో గల” జంతులక్షణాలను బలియివ్వకుండా మూగజీవియైన ఒక జంతువును బలి యివ్వడం మానవతాలక్షణ మనిపించుకోదు. రాగద్వేషములు, అహంకారమమకారములు ఈ జంతులక్షణాలకు ఉదాహరణలు. అటువంటి దుష్ట లక్షణాలను హోమగుండములో భగవంతునికి అర్పించినప్పుడు, ఆయన వాటిని స్వీకరించి వాటికి బదులు మంచిఆలోచనలను, మంచి లక్షణాలను మీలో నింపుతాడు. సృష్టికర్తయైన భగవంతుడొక్కడే దుష్టగుణాలను స్వీకరించి వాటికి బదులు మంచి గుణాలను ప్రసాదించగల శక్తిగలవాడు. ఇది. భారతదేశములో ప్రభుత్వ కోశాగారములు ఒక్కటే మాసిపోయి, చిరిగిపోయిన కరెన్సీ నోట్లను తీసికొని క్రొత్తనోట్లను ఇవ్వడానికి అధికారము కలిగియుండడాన్ని మనకు గుర్తుచేస్తుంది.
(దైంది.పు.45)
(చూ|| యజ్ఞము)