నేను భక్తపరాధీనుడను. సామాన్య మానవరూపంలో నేను మితో కలసిమెలసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ నా శక్తిని. నా స్వభావమును ఎంతటి మేధావులైనా అర్థం చేసుకోలేరు. మానవత్వాన్ని ఏకత్వపరచి, ఆత్మతత్త్వాన్ని నిరూపించి దైవత్వ స్థానంలో చేర్చటమే నా లక్ష్యం. నాలో ఉన్నటువంటిది ఎటువంటి కొలతలకూ అందనిది, పరిమాణమునకు అతీతమైనది, పరిశోధనలకు అంతుపట్టనిది. అదియే ప్రేమ. నాప్రేమతత్త్వమును గుర్తించి అనుభవించినవారు మాత్రమే నన్ను కొంతవరకు తెలిసికొనగలరు. నా అనుగ్రహాన్ని పొందినప్పుడు మీకు అనంతమైన జగత్తే లభిస్తుంది. అమూల్యమైన వజ్రమును నేనుండగా తుచ్చమైన, అశాశ్వతమైనవాటి కొరకు ఎందుకు ప్రాకులాడెదరు? నన్నే కోరండి. ప్రేమతో, భక్తితో కోరినట్లయిన నేను తప్పక లభిస్తాను.
(స.సా.న..2000 వెనుకపుట)
(చూ|| భగవంతుడు)