ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది. ఇది షట్కర్మలనే మార్గములు మరొక విధముగా లోకానికిభోధించింది. గీత షడంగముల రూపాన్ని ధరించింది. గీతయందు ఆరారు అధ్యాయములకు ఒక షట్కము చొప్పున మాడార్లపద్దెనిమిది అధ్యాయములు ఉన్నవి.మొదటి షట్కము కర్మ మార్గము. రెండవషట్కము ఉపాసన మార్గము. మూడవది జ్ఞానమార్గము. ఏతావాతా వేదములనుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తులనుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైన ఆచరణ రూపమైన మానవత్వము ఆవిర్భవించింది. గీత యొక్క సారమేమానవజాతి. ఈ జాతికి అభిమతము గీతనే. భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించిన ప్రాపర్టీకాదు. యావద్విశ్వమునకు సంబంధించినది. ఇది భగవద్గీత భగవంతుని యొక్క వాక్యం.
(బృత్ర.పు. 181/182)
శాంతిని ముక్తిని కోరేవారికి భగవద్గీత ఒక చిత్రపటం (Map) వంటిది. భగవంతుడు అందరి హృదయాలలోను సారథిగా ప్రతిష్టింపబడి ఉన్నాడు. సరైన మార్గం కోసం వేడుకుంటే ఆయన తప్పక జవాబు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మీలోని భగవంతుని చిత్తశుద్ధితో వేడుకుంటే మీకోసమే ప్రత్యేకించబడిన ‘ గీత ను మీలో ప్రతి ఒక్కరికీ ఆయన వినిపిస్తాడు".
(శ్రీస.స.పు 219)
(చూ|| అందము, ఆనందమయుడవు. అర్జునుడు, పంచమ వేదము. భూతచిత్త చిదాకాశములు)
భగవద్గీత లోకొన్నీ అం శాలు మాత్రమ్ - కృష్ణుడు
"వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.”
మేలు మేలు పాండవుల గాచి నావు
కంసుని మద మణచినావు
వసుదేవ, దేవకీల, చెరవిడిపించినావు
పదహారువేల, రమా మణుల నుబ్రోచినావు (సా.పు. 107)
కృష్ణుడు అంత నలుపూ కాదు, అంత తెలుపూ కాదు! మూడు భాగాలు నలుపు, ఒక భాగము తెలుపు, కలిపితే ఎంతో అంత, అతనిది శ్యామల రూపము! నందుడు వైష్ణవుడు కాబట్టి, అబ్బాయికి, స్నానము చేయించి ఒకే ఒక గీత కస్తూరీ తిలకము పెట్టేవాడు. నందుని తల్లి ఆమె యొక్క కంఠాభరణమున శ్రీకృష్ణునికి ధరింపచేసినది. అదే కౌస్తుభము. ఆ కాలములో దానికి చాల గొప్ప వెల! ఆ పతకము మధ్య ఒక పెద్ద పచ్చ. మరకత రత్నము వుండెను. దాని చుట్టూ విలువైన వజ్రములు పొదగబడినవి. అది శ్రీకృష్ణుని వక్షస్థలమందు తళతళ లాడుతూ వుండేది.
చేతికి కంకణములు, అంటే వెండి కడియములు, పల్లెలోవాళ్ళు, గొల్లపిల్లలు ఆ కాలములో వేసుకొనే వారు. అయితే కృష్ణుడు వేసుకున్న కంకణములకు వేరే అంతరార్థమున్నది. యజ్ఞ సమయమందు, పెండ్లి సమయమందు కట్టుకునే దీక్షా కంకణములు కావు. అవి ప్రతిజ్ఞా కంకణములు-మూడు! గీతలో వాటిని గురించి కృష్ణుడు వెల్లడించినాడు. మొదటిది: పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రెండవది: అనన్యాశ్చింత యంతోమాం - యే జనాః పర్యుపాసతే: తేషాం నిత్యాభియుక్తనాం యోగక్షేమం వహామ్యహం. మూడవది: సధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్యా సర్వపాపాభ్యో మోక్షయిష్యామి మాశుచ. చూడండి, రెండవదాంట్లో యేజనాః అంటాడు! ఎవరినైనా సరే, అనన్యభక్తితో భగవంతుని భజించిన, ఉపాసన చేసిన, వాని యోగక్షేమమును వహిస్తాడు. ఏదేశము వారైనా, ఏమతము వారైనా, పండితులైనా, పామరులైనా సరే, అని దీని కర్థము. "నేను జగత్తును సంరక్షిస్తాను: ధర్మసంస్థాపన చేస్తాను, అన్యాయ అక్రమ అసత్యములనే అహంకారజన్య కల్మషము లన్నియునూ నాశనము చేస్తాను. భక్త రక్షణ సలుపుతాను, అనేది కంకణముల భావార్థము. దానివలననే శ్రీకృష్ణుని ప్రేమావతారము అంటారు. తిరిగి అట్టి పూర్ణ ప్రేమావతారము వచ్చి నప్పుడు, మీరందరూ దర్శనభాగ్యమునందుకొంటున్నా రంటే, మీ జన్మములు ఎంత పుణ్యము, ఎంత సార్థకము! దానికే! ఇదిగో! పరమ పవిత్రమైన ఈ కౌస్తుభమాల, శ్రీకృష్ణుడు తన మెడలో వేసుకున్న పతకము! చూసి ఆనందపడండి! (శ్రీవారి హస్త మందు ప్రత్యక్షమైన ఆ దివ్య కంఠాభరణమును, విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, సమావేశమైన ఇతర భక్తులకు శ్రీవారే సమీపమునకు వచ్చి, చూపించి ఆనంద పరచిరి. తరువాత, శ్రీవారే దానిని శ్రీకృష్ణుని చందన విగ్రహము యొక్క మెడలో వేసిరి). (స. సా.ఆ. 77 పు. 181/182)