“ప్రేమ అమృత స్వరూపాయచ" అన్నాడు నారదుడు.ప్రేమ అమృత స్వరూపము. ఈ బాహ్య ప్రపంచమునందు మానవుడు చతుర్విధ పురుషార్ధములను మాత్రమే లక్ష్యము నందుంచుకొని ఇదియే మోక్షానికి తగిన మార్గమనిభ్రమిస్తున్నాడు. కాదు... కాదు... ధర్మ, అర్ధ, కామ, మోక్షములు మాత్రమే పురుషార్ధములు కావు. పంచమ పురుషార్థం కూడానూ ఒకటున్నది. అది మోక్షమునకంటే అతీతమైనది. అదియే పరమ ప్రేమ. ఈ ప్రేమత త్త్వ ము దైవత్వము. దైవము వేరు. ప్రేమ వేరుకాదు. దైవము ప్రేమ, ప్రేమయే దైవము. ఇట్టి ప్రేమ తత్త్వా న్ని మనం గుర్తించినప్పుడే మానవత్వాన్ని కూడనూ మనం అర్థం చేసుకోగలము.
(శ్రీ,ఫి. 1995 పు. 2)
(చూ॥ సోహం తత్వము)