భక్తి అనగా దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టించబడిన పదార్థముల ప్రయోజనము. దీనికి ఉదాహరణము మనము చేసే పూజలు. బాహ్య సంబంధమైన పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము. ఈ పుష్పములు యెక్కడి నుండి వచ్చినవి? మీరు సృష్టించినవా లేక మరేవిధంగానైనా కల్పితము చేసినవా? కాదు కాదు. ఇవి భగవత్ సృష్టికి సంబంధించిన పుష్పములు. భగవంతునిచే సృష్టింపబడిన పుష్పములు, నీవు తెచ్చి భగవంతునికి అర్పితము చేయుటలో విశేషమేమిటున్నది? భగవంతునిచే సృష్టింపబడిన పదార్థముల చేత భగవంతుణ్ణి ఆరాధన చేసే ప్రక్రియలను సాధారణమైన భక్తిగా నిరూపిస్తూ వచ్చింది గీత. ఏ ప్రయత్నము ద్వారా నీ హృదయబృందావనము నందు సత్శీలసదాచారములైన గుణములను అభివృద్ది గావించి పోషించి అట్టి పుష్పములచేత భగవంతుని ఆరాధన చేసే ప్రక్రియనే పరాభక్తి అన్నారు.
(శ్రీ.గీ.పు.59)