అవస్థలు

ఆత్మవిచారమునకు ఆశ్రమధర్మము లెంతయో అవశ్యము. ఆశ్రమ ధర్మజ్ఞానము స్వార్జితము. బాల్యావస్థ అనంతరము వరకూ మనుడు ఆశ్రమవాసి కానేరడు. అంతవరకూ వానికి ప్రాప్తించు జ్ఞానవిశేషము లేనియూ లేవు.

 

జీవశరీరమునకు బాల్యకౌమారయౌవన వార్ధక్యావస్థలున్నటుల జ్ఞానమునకు కూడను నాలుగు అవస్థలు కలవు. అందు మొదటిదగు బాల్యావస్థయందు జీవితము అజ్ఞానదశయందుండి శిష్యత్వమునంగీకరించిదాశ్యమునకుశిక్షణకునులోనై యెట్టి బాధ్యతలును లేక జ్ఞానార్జన జేయుచుండవలెను. రెండవదశయగు యౌవనమున సంఘనిర్వహణా బాధ్యతను వహించి ధనార్జనమందును దాని వినియోగమునందును జాగరూకత కలిగితనకంటే పిన్నలకు తగిన శిక్షణనొసంగు ఆదర్శములను అందించుచుపెద్దలను అనుసరించుచూజ్ఞానాభివృద్దిని గడించుచుండవలెను. మూడవదశయగు కౌమారమునందు కేవలము స్వీయ సంఘ కుటుంబమే కాక ప్రజాసౌఖ్య నిర్వహణాభారము సైతము వహించి లోక శ్రేయమునకు తన సౌఖ్యమునైనా లక్ష్యపెట్టకపాటుపడుచూ అంతర్  జ్ఞానమును సంపాదించు చుండవలెను. నాల్గవదియగు వార్ధక్యమునందు తనకు పూర్వము కలిగిన అనుభవమూలమున ఇహలోక సుఖాదులు నిస్సారములనియుఅనిత్యములనియు గ్రహించి విజ్ఞానవంతుడైదయాపరుడైసర్వభూతహితుడై తనయనుభవజ్ఞానమును ఇట్లు లోకమునకు చాటవలెను. జీవుల గుణములనువృత్తులను నాలుగు తరగతులుగా గనుపించుచున్నవి.

 

తెలివిని పెంచుటకు చదువువలే జ్ఞానమును పెంచుకొనుటకు ప్రవర్తన ముఖ్యము.బాల్యావస్థయందువిద్యతోపాటు,వినయ,విధేయత,భక్తి,శ్రద్ధ,పరిశ్రమయునుండవలెను.యౌవనావస్థయందుధనార్జనమేకాకసంఘనిర్వహణమేకాక,సదాచారశీలసంపన్నతను,ధార్మికఆధ్యాత్మికభావములను,చిత్తమునుతీర్చిదిద్దుకోవలెను.కౌమారమునకేవలముసంఘ కుటుంబ పోషణలో పాటునీతి నిజాయితీలనుపెంపొందించుకొని తన బిడ్డలకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి సమాజమున అట్టిసదాచారమును నిరూపించవలెను. సంఘమును ధిక్కరించి స్వకుటుంబ పోషణను మాత్రమే లక్ష్యమందుంచుకోరాదు.

(ప.వా.పు. 163/165)

(చూ॥ అంతర్వాణివేదము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage