కామం మూడుతలల రక్కసి.కామితార్థం సిద్ధించగానే లోభం బయలు దేరుతుంది. దొరికిన దానిని దాచిపెట్టివృద్ధి చేయాలనే పిసినారి కోరిక. కోరినది దొరకకపోతే క్రోధం తలయెత్తుతుంది. తపస్సువల్ల కూడా స్వభావం మారకపోవచ్చు. భస్మాసురుని విషయం చూడండి. కోరిన వరం ఇచ్చిన భగవంతుని నెత్తిమీదనే చెయ్యి పెట్టాలని తయారైనాడు. కామ, క్రోధ, లోభములు మూడూ రజోగుణమునకు రూపములే. లక్ష్యమే ప్రధానమనీ, అవలంబించే విధానములు ముఖ్యము కావని భావించి నిరంతరంగా రజో గుణ వ్యాపారం కొనసాగుతుంది. గమ్యం చేరుకోవటమే ముఖ్యం. అనుసరించే మార్గం ఏదైనా ఫరవాలేదు అనుకోవటం రజో గుణ లక్షణం లక్ష్యం ఉన్నంతగానూ సాధనలు కూడా ఉత్తమంగా వుండాలి.
(శ్రీస.సా..పూ.పు.55)