నవమార్గముల నాచరించువారు రెండు తెగలకు చెందియున్నారు. మొదటివారిది, కఠిన సాధన: రెండవవారి సాధన నిరపాయమును, సౌలభ్యమునై యున్నది. ఈ రెండింటినే భక్తి, ప్రపత్తి అని అందురు. మర్కటకిశోర న్యాయముగా నాచరించు. దానిని భక్తి అనియు, మార్జాలకిశోర న్యాయమైనదానిని ప్రపత్తి యనియు చెప్పుదురు.
భక్తి ఎప్పుడును తైలధారవలె అవిచ్చిన్నముగ నుండవలెను. భక్తి ప్రపత్తు లొక్కటే అయియుండియు, భిన్నరూపముగ ప్రవర్థమాన మగుచున్నవి. ప్రేమలేక ప్రపంచమున ఏ వస్తువును లభించదు. ప్రేమ ఉండిననే అనురాగమేర్పడును. అనురాగ ముండిననే లభించిన వస్తువును రక్షించుకొనును. ఈ రెండింటి యందును సమమైనది ఒక్క ప్రేమే అయినను, ప్రవర్తనలు మాత్రము భిన్నముగ నుండును. మర్కటకిశోర మార్గమున తల్లి ఎట్లు తిరుగు చుండినను, బిడ్డ తనరక్షణ భారము లేక ఉండును. అట్లే భక్తుడును, తనను భగవంతుడు చేయు పరీక్షలందును, లోకమునందలి నిందాక్షేపణలు, సిగ్గు ఎగ్గులందును సహనము ప్రదర్శించి, విసుగుచెందక, విరక్తి బొందక, సోమరిగాక సర్వకాల సర్వావస్థలయందును భగవన్నా మమును విడువకుండ ఉండవలెను. ఇందులకు ఉపమానము భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడే.
ఇక ప్రపత్తి మార్గమట్లుగాక మార్గాల కిశోర న్యాయము వలె ఉండును. "సర్వభార సమర్చితః" అని తనభారమునంతయు భగవంతునిపై నుంచవలెను. పిల్లి పిల్ల తన తల్లిపిల్లిపై వేసి తానరచుచుమాత్ర మూర కున్నప్పుడు, తల్లి పిల్లే, పిల్లిపిల్లను తననోట కరచుకొని, ఉన్నత ప్రదేశములకు మార్పుచు. ఇరుకైన స్థలములందు సహితము అపాయము లేక తీసుకొనిపోవును. అట్లే భక్తుడగువాడు. ప్రకృతి తన్నెట్లు ఎదుర్కొనినను, తన సర్వభారమును పరమాత్ముని పైనుంచి సంపూర్ణ శరణాగతుడైనయెడల, తనను సర్వ విధముల భగవానుడేసంరక్షించుకొనును. ఇందులను లక్ష్మణ సేవయే సాక్షి. భక్తి నిష్టకంటెను ప్రపత్తినిష్ట సర్వదా శ్రేష్టము. అన్ని విధముల భగవంతునికి శరణాగతచేయుటే ప్రపత్తి లక్షణము,లక్షణుడు రామచంద్రుని సేవకై, తన కడ్డముగు ధన, దార, మాతృ గేయాదుల నన్నింటిని త్యాగమొనర్చి, చివరకు ఆహారాదులు సైతముత్యజించెను. ఒకరోజు కాదు. ఒకనెలకాదు ఒక్క సంవత్సరమూ కాదూ. పదునాలుగేండ్లు సర్వసుఖ సంతోషములు శ్రీరామ చంద్రుడే యనియు, తన సర్వస్వమును తానే చూచుకొనుననియు, తనను విడనాడక వెంటాడుటే తన జీవిత లక్ష్యమని శరణాగతుడై ప్రవర్తించెను. కాన, సర్వభారమును పరమాత్మ పై నుంచి తనను మాత్రము విడువక, మరువక వెంటాడుచుండిన సర్వమూ తానే చూచు కొనును. ఇది ప్రపత్తి లక్షణము.
(ప్రే.వాపు 58/99)