మతము మతము మధ్య ద్వేష ము
జాతి జాతికి మధ్య జగడము
దేశ దేశములOదు రగడము
దేనికయ్యా మత బోధలు !
కన్ను విప్పి చూడరోరన్నా
ఈ సాయి దేవుని ఎన్నిగా ఎందైనా
మున్ను శి రి డి నేడు పర్తి ఉన్
తన్ను భావన చేయు భక్తుల కన్ను
(స సా జ 2013 పు 19)
ఒకానొక సమయమున Munshi (Bhavan s అధిపతి) Bombay లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సభలో స్వామి మాట్లాడవలసి వచ్చింది. వారికి నిజంగా తెలివితేటలు ఏమాత్రము వున్నట్లు నాకు కనబడలేదు. ఈ సమావేశానికి పెద్ద పెద్ద Doctors, Vice Chancellors, Principals, Professors అందరూ వచ్చారు. ఎవరికి వారు చాల తెలివికలవారని భావించుకున్నారు. అది కాదు తెలివికి లక్షణం మన యొక్క ప్రవర్తనలో వుంది అంతా. చెఱుకుకు విలువ దాని రసము వలననే,చెఱుకు మాదిరే వుంటుంది. వెదురు బొంగు. దానికి దాని ఒడ్డు పొడుగుకు ఇస్తాము. విలువ. అట్లే మానవుని విలువ అతని గుణముబట్టే. సరే ఒకరు ఒక ప్రశ్న వేసారు. స్వామీ ఈనాడు హిందువులు, బౌద్ధ మతస్తులు, Christians, Jains ఒకరికొకరు భేదాభిప్రాయములతో కలహించుకుని ద్వేషిస్తున్నారే. దీనికికారణమేమిటి" అని అడిగారు. నిజంగా ఈ కలహాలకు కారణము వారి వారి దుర్గుణములే కాని మతములు కావు. అన్ని మతములు మంచినే చెప్తూ వచ్చాయి. కానీ మతమందున్న దురభిమానమే అన్నింటికి మూలము. ఈ దురభిమానము చేతనే ఒక మతస్థులు మరొక మతస్థులను ద్వేషిస్తున్నారు. ఇలాంటి తత్వము కలవారిని మత స్థాపకులు అనరాదు. వారు కిరాతకులు. వారి చిన్ని బుద్ధిని వారు బహిర్గతము చేసారు. అంతే. నేను చివరకు వారికి సమత్వమును గురించి చెప్పాను. మీరందరు చక్కగా నేను చెప్పేదాంట్లోని అర్థము చక్కగా గుర్తించాలి. హైందవమతము ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికి తెలియదు. ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తున్నారే కాని అసలు సంగతి ఎవరికి తెలియదు. అయితే తరువాత వచ్చిన బౌద్ధమతమునకు, క్రైస్తవమతమునకు చక్కగా కాలనిర్ణయము చేసినారు. 1918 సం||పూర్వము వచ్చింది. క్రైస్తవ మతము. ఇట్లే ఇస్లాము, బౌద్దమతము, సుమారు 900 సంవత్సరముల క్రిందటనే వచ్చినవి. ఇట్లా ఏర్పడినపుడు ఏమి జరిగింది - అనాదిగా వుండినది హైందవ మతము, 2000 సంవత్సరములకు ముందు పుట్టినది క్రైస్తవమతము, 900 సంవత్సరములకు పూర్వ ముద్భవించినవి తదితర మతములు, ఇస్లాము. వీటికి పరస్పర సంబంధమును మనము ఈ విధముగ చెప్పవచ్చును. హైందవమతము Grand Father; బౌద్ధమతము, క్రైస్తవమతము Father, ఇస్లాము తదితర మతములు Grand sons - అని చెప్పవచ్చును. కాబట్టి ఇది ఒక Family వంటిదే. (ప్రత్యేకమైన Fighting కాదు) కనుక మన మందరము ఒక కుటుంబమునకు చెందినవారము. అన్న విషయం మనం చక్కగ గుర్తించాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మతమునకు ప్రాముఖ్యత వస్తూవుంటుంది. దీనికి సంబంధించిన ఇంకొక ఉదాహరణ చెప్తాను.
ఒక ఏనుగు దగ్గరకు కొంతమంది గ్రుడ్డివారు వెళ్ళారు. ఈ కధ మీకందరికి తెలిసి వుంటుంది. ఒక గ్రుడ్డివాడు ఏనుగు కాలును తడిమి చూచి "అయ్యా ఏనుగు ఒక స్తంభము వలె ఉంది " అని అన్నాడు. మరొకడు ఏనుగుచెవులు పట్టుకొని పరిశీలనగా ఏనుగు అంటే ఒక చేటవలె వున్నట్లుంది" అని అన్నాడు ఇంకొకడు, తోకను తడిమి "ఏనుగు ఒక పాములా వుంది" అని అన్నాడు మరొకడు తొండము పట్టుకొని ఏనుగు ఒక తీగలా వుంది అన్నాడు. వారి వారి అనుభవమును బట్టి వారికి తోచిందివారు చెప్పారు. ఇందులో ఎవరిదీ తప్పు? అందరిది Correct, ఆయితే ఏనుగు స్వరూపము ఎట్లు ఏర్పడుతుంది? - ఈ నలుగురు గ్రుడ్డివాండ్లు చెప్పిన అంగములన్ని కలిసి నపుడే. ఇదే విధంగా ప్రతి మతమువారు ఏనుగు సమగ్ర రూపంలోని ఒక్కొక్క అంగము యొక్క తత్వాన్ని చెప్పుతున్నారే గాని వారు స్పృశించని ఇతర అంగముల తత్వమును చెప్పుటలేదు. అన్ని అంగములను చేర్చిన ఏనుగు సమగ్రరూపమున మనము చూడవచ్చును. అదే విధముగా ఈ వివిధ మతముల ప్రభోదములన్నియు చేర్చితే అదే విశ్వమత మవుతుంది. ఇదే నిజ మతము, ఈ సత్యాన్ని గుర్తించి మతకలహములు లేకుండ సమత్వమును పెంపొందించు కోవాలి. ఎవరి మతమును వారు స్వేచ్చగా అనుసరించ వచ్చును. కాని అన్ని మతములవారి గమ్యము ఒక్కటే. దివ్యత్వము, పవిత్రత ఒక్కటే. ఒక గ్రామంలో నున్న చెఱువుకు నలువైపుల మెట్లు వుండును. నలువైపుల నుండి ఆ ప్రాంతమువారు వచ్చి దానిలో నీరు తీసికొనిపోతారు. వారు వివిధములైన దిక్కుల నుండి వస్తారు. అయితే వారు వచ్చేది ఆ చెఱువుకే - ఆ చెరువులో నీరు కొరకే ఈ సత్యాన్ని గుర్తించాలి. (శ్రీది.పు.132/135)
కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా
గుర్తించడానికి లేక కొన్ని సందర్భాలలో
కొన్ని అవసరాల నిమిత్తమై
ధరించే దుస్తులవలె, ప్రపంచములో
అనేక మతములను ఉపయోగించు కోవడం జరుగుతోంది.
(దై.మ.పు.110)
మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటె
వస్త్రభేదము వేరు వస్తువొకటె
శృంగారములు వేరు బంగారమొక్కటె
జీవ జంతువులు వేరుజీవుండు ఒక్కడె
జాతిరీతులు వేరు జన్మమొక్కటె
పూలజాతులు వేరు పూజ ఒక్కటె
తెలియ లేకను మానవుల్ తెలివి తప్పి
బ్రతుకు కోసము బహుబంధ బద్దులైరి
ఇంతకన్నను వేరెద్ది యెరుకపరతు
సాధు సద్గుణగణ్యులొ సభ్యులార!
ఈ దైవ సృష్టిలో కనబడే భిన్నత్వంలో వుండే ఏకత్వం గుర్తించి వర్తించుటే మానవ విజ్ఞతకి, జీవితానికి సార్థకత. ప్రతి మతము దైవానుగ్రహప్రాప్తి అనే లక్ష్యమునకు ఒక మార్గం. మతానికొకదైవం లేడు. దైవానికొక మతం లేదు. అన్ని మతముల ప్రబోధసారము ఒక్కటే దైవ పితృత్వం, మానవ సోదరత్వం Fatherhood of God and Brotherhood of Man, భగవంతుడు ప్రేమ స్వరూపుడు. మానవాళి సర్వదా పెంచుకోవల్సిందీ, పంచుకోవల్సిందీ పరస్పర ప్రేమయే. అదే మానవ శాంతియుత సహజీవనానికి ఆధారం గమ్యం కూడాను. (శ్రీ...పు.114)
మతము క్రమశిక్షణను నేర్పి హితముగూర్పు
ఆత్మశక్తియు తేజంబు అధిక పరచు
దాని మర్మంబు నెరుగక దాటుకొన్న
జాతి సంస్కృతి నశియించి జబ్బుపడును"
(శ్రీ. జ.పు.5)
"మతములన్ని చేరి మంచినే బోధించు
తెలిసి మెలగవలెను తెలివి తోడ
మతులు మంచివైన మతమేమి చెడ్డది ?
వినుము భారతీయ వీరసుతుడ."
(సా.. పు. 375)
ఒక మతము ఉత్తమమైనదనియు, మరొక మతము హీనమైనదనియు భావించుకోవటం, బేధములు పెంచుకోవటం - ఇది అజ్ఞానము యొక్క ప్రభావం. అన్ని మతముల యొక్క ప్రభావం పవిత్రమైనదే. అన్ని మత సిద్ధాంతములు సత్యమైనవే. సర్వ మతముల సారము, సమస్త ధర్మముల యొక్క మూలము, సర్వ శాస్త్రములయొక్క కీలకము సత్యస్వరూపమైన ఆత్మ తత్త్వమే. మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యమొక్కటేననే సత్యాన్ని గుర్తించి వర్తించటమే మానవత్వము యొక్క ప్రధాన కర్తవ్యం, త్యాగం, ప్రేమ, దయ, నీతి, నిజాయితి ఇలాంటి పవిత్రమైన విషయములు సర్వ మతములయందు సామాన్యమైనవిగా ఉన్నాయి. అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తింప చేసుకొనే నిమిత్తమై ప్రతి మతమునందుకూడనూ భిన్నభిన్న మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాయి, భారతీయుల సిద్ధాంతము, భారతీయుల సంస్కృతి, భారతీయుల పవిత్రమైనటువంటి మార్గములు అన్ని మతములయందు అంతర్భూతమై, అంతర్వాహినియై రాణిస్తూ వస్తున్నవి.
"ఏకోవసి సర్వభూతాంతరాత్మ" అనేటటువంటి సత్యాన్ని పురస్కరించుకొని, సర్వ జీవుల యందు ఉన్నది "ఏకాత్మయే అనే సత్యాన్ని కూడనూ హెచ్చరిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి. బౌద్ధ మతమునందు, ఇస్లాం మతమునందు, క్రిస్టియన్ మతమునందు ఇట్టి ఏకత్వాన్ని అనేక స్థానములందు హెచ్చరిస్తూ వచ్చింది. శారీరకంగా, కర్మరీతిలో భిన్నంగా గోచరించినప్పటికిని, ఆత్మతత్త్వము నందు అందరూ ఒక్కటేననే సత్యాన్ని క్రిష్టియన్ మతము వెల్లడిస్తూ వచ్చింది. ఒక్క ప్రభువు యొక్క బిడ్డలే సర్వులూ అనియూ, అందరూ సోదర భావమునే పెంచు కోవలెననియూ, దైవం యొక్క పితృత్వాన్ని, మానవునియొక్క సోదరత్వాన్ని అభివృద్ధి పరచుకోవలెనని బోధించాయి. "ఏకం సత్ విప్రా బహుధా వదన్తి " ఉన్నది ఒక్కటే, కాని భిన్నత్వం నీ మానసిక చర్యలే. భగవంతునికి అర్పితం కావలసినది ఏకాత్మభావమే. భారతీయులురెండు హస్తములు చేర్చి నమస్కారము" అని ఉచ్చరిస్తూ వుంటారు. ఈ నమస్కారం యొక్క అంతరార్థం ఏమిటి? అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చటమే ఈ నమస్కారముయొక్క అంతరార్థం. అదే విధముగనే ఇస్లాం మతంలో "సలామ్" అన్నారు. "స" అనగా సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములు. సత్స్వరూపుడు, సత్యరూపుడు అని అర్థము. సత్, చిత్ ఆనంద మయుడు. "ల" అనగా లయము.ఈ సకారస్వరూపుడైన పరమాత్మయందులయమై ఉండటమే "సలాం" అని అర్థం. క్రిస్టియన్ మతము నందుకూడనూ " ఏసు" అని పిలుస్తూ వచ్చారు. "ఏ" అనగా ఏకత్వము. "స" అనగా దివ్యత్వము. దైవము ఒక్కడే. అనేకము లేదు. కనక ఏకత్వమైన దివ్యత్వంలో మానసిక తత్త్వములు అంకితం గావించుకోవటమే ఈ “ఏసు" యొక్క అంతరార్థము.
జైనమతము నందుకూడనూ ఇదే విధమైన అంతరార్థమును ప్రబోధిస్తూ వచ్చాడు, మహావీరుడు. ఇంద్రియములను పలు పలు విధములుగా ప్రవహింప జేసినప్పుడు అనేక విధములైన మార్పులు, కూర్పులు జరుగుతూ వుంటాయి. ఈ ఇంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే ఇట్టి దివ్యమైనటువంటి ఆత్మతత్త్వము మనకు అర్థమవుతుంది. కనులకు చూచుటటువంటి శక్తి వుంటుంది. చెవులకు వినే శక్తి ఉంటున్నది. చూచునది, వినునది, పలుకునది తలంచు నది సర్వమునకూ ఒక్క దివ్యత్వమే ఆధారము. కనుకనే ఈ అన్నింటిని ఏకత్వాన్ని చేసినప్పుడే జయత్వాన్ని పొందుతాం. కనుకనే మహావీర త్యాగికి "జయ" అనే బిరుదునుకూడా అందించారు. "జయ"అనగా ఏకత్వమును గావించటమే జయత్వము యొక్క అంతరార్థం. అందరూ ఒక్కటే. దేహములు వేరు,ఆభరణములు వేరైనప్పటికినీ సువర్ణము ఒక్కటే. అదే విధముగనే ఏకత్వాన్ని భావించేటటువంటి దివ్యాత్మ తత్త్వమునే సర్వ మతములూ ప్రబోధిస్తూ వచ్చాయి. బౌద్ధమతము నందుకూడమా ఇలాంటి ఏకత్వమునేసూచిస్తూ వచ్చింది. ప్రతి మానవుని యందును నిజముగా ఆవిర్భవింపవలసినది ప్రేమ తత్త్యము.ఏది లేకపోయినా జీవితం సాగిపోవచ్చును గాని, ప్రేమ లేకపోతే జీవితం స్తంభించిపోతుంది. ప్రతి జీవికి ప్రేమయే ప్రాణం. ఇలాంటి ప్రేమతత్త్యము కలిగినప్పుడే అహింస, హింసకు పూనుకోదు. దివ్యత్వమైన మానవత్వం రాణించవలెననినప్రేమ తత్త్వమును అభివృద్ధి గావించుకొనవలెను. కనుక ప్రతి మతమునందలి ప్రబోధలు సరియైన రీతిలో అర్థం చేసుకుంటే ఏకత్వాన్ని మాత్రమే గుర్తింపజేస్తుంది. మతభేదములనేటటువంటివి మానవుని మతిని చెడగొడుతున్నాయి. కనుక మతబేధములను ఎవ్వరూ పాటించరాదు. కేవలం ఒక్కొక్క మానవత్వం భిన్నత్వంగా గోచరించినప్పటికినీ, అందున్నటువంటి ధాతృ తత్వము ఒక్కటిగానే మనం విశ్వసించాలి. ఇలాంటి పరిస్థితుల యందు మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, వికశింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు ఆవతారములు, మహాపురుషులు, దైవాంశ సంభూతులు ఆవిర్భ విస్తుంటారు. ఈ జగత్తునందు రెండువేల సంవత్సరములకు పూర్వం రోమన్ దేశంలో యూదులు అనే మతంవారు వుండేవారు. ఈ యూదులకు యెహోవా’కు మించిన దైవం మరొకడు లేడని వారి విశ్వాసం. అతి శీఘ్రకాలంలోనే ఇజ్రాయిల్ ప్రజలను రక్షించే నిమిత్తమై "మెస్సయ్య" అనేటువంటివాడు వస్తాడని వారి నమ్మకం. ఈ యూదులకు పవిత్రమైన స్థానం జెరూసలెమ్ .ఇక్కడ వారివారి మత సిద్దాంతములను, ఆచారములను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమములను జరుపుకొను చుండెడివారు. క్రమక్రమేణా కాలము మారిన కొలది మానవ స్వభావములు కూడా మారుతూ వచ్చాయి. కాలక్రమంలో టాంపే అనే వాడు "జెరూసలెమ్ వశపరచుకొన్నాడు. అప్పటి నుంచి ఈ జెరూసలెమ్ రోమన్ వారికి ప్రధాన స్థలమైంది. యూదులు నిరుత్సాహపడక, తమ మతమును పెంచుకోవలెననే తలంపుతో తీవ్రమైన ప్రయత్నం సలుపుతూ వచ్చారు. ఆనాటి పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని రాజులనే దైవంగావిశ్వసించి కొలిచేటటువంటివారు. ఇట్టి పరిస్థితులలో "జీసస్" అవతరించాడు. ఈ జీసస్ బాల్యము నుండే కరుణ, ప్రేమ, దయ, త్యాగము అనేటటువంటి భావములను ప్రకటిస్తూ వచ్చాడు. లేతవయస్సునందే కర్తవ్య కర్మలను నిర్వర్తించటం మానవుని ప్రధాన ధర్మమని విశ్వసించి, తండ్రి చేసే పనులయందు ప్రవేశించి వడ్రంగి పనిని నేర్చుకుంటూ వచ్చాడు. కాని దురదృష్టవశాత్తు 12వ సంవత్సరముననే తండ్రి మరణించాడు. కొంతకాలం తన తండ్రి పనినే చేసుకుంటూ, క్రమక్రమేణా తన మనస్సు అభివృద్ధి కావడంచేత, తల్లి వద్ద శలవు తీసుకొని దేశసేవ నిమిత్తమై దేశములో ప్రవేశించాడు. పూవు పుట్టగనే పరిమళం అభివృద్ధి గావించినట్లుగా, ఈ పిల్లవానియందు పవిత్రమైన భావములు ప్రకాశిస్తూ వచ్చాయి. ఈ పిల్లవాడు జన్మించినప్పుడు అరేబియన్ రాజులుకూడా అతనిని చూడటానికి వెళ్ళారు. ఇందులో ముగ్గురు మూడు విధములైన భావములను ప్రకటించారు. మొదటి వ్యక్తి పిల్లవానిని చూచి "ఈ పిల్లవాడు భగవంతునిప్రేమించేవాడుగా రూపొందుతాడు" అని తనలో తాను చింతించాడు. రెండవ వ్యక్తి "పరమాత్ముని యొక్క ప్రేమకు ఈ పిల్లవాడు గురికావచ్చును." అని తలిచాడు. మూడవ వ్యక్తి "తానే పరమాత్మునిగా ఈ పిల్లవాడు ప్రకటించుకోవచ్చు" అని తలిచాడు. "ఈ పిల్లవాడు భగవంతుని ప్రేమించవచ్చును" అని తలచు కోవటమే "Messenger of God" అని అర్థం. భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమించవచ్చు" అని తలచుకోవటమే I am the Son of God అని అర్థం. ఈ పిల్లవాడే భగవంతుడు కావచ్చును" అని అనుకోవటమే I and My father are one" అని అర్ధము.
కనుక ఈ Messenger అనే టటువంటివాడు ఎలాంటివాడు? తన తత్త్యాన్ని మాత్రమే తాను గుర్తించుకోవటం. The one you think you are (నీవనుకుంటున్న నీవు). రెండవది " I am the Son of God" అనేది the one others think you are (ఇతరులుభావించేనీవు), ఇతనే దైవస్వరూపుడుగా వుండవచ్చును. మూడవది "I and My father are one " అనేది The one you really are (నిజంగా నీవైన నీవు) అనే సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. ఈ విధమైన ప్రబోధనలను ఏసుక్రీస్తు ప్రచారం సలుపుతూ వచ్చాడు. కారణ కర్మ కర్తవ్యాలను పురస్కరించుకొని కొంతమంది వ్యక్తులవల్ల అనేక మార్పులు సంభవిస్తూ వుంటాయి. అన్ని మతముల యందునూ కూర్పులూ, మార్పులు జరుగుతూ వుంటాయి. ఈ క్రిష్టియన్ మతమునందుకూడనూ ఇలాంటి కూర్పులు మార్పులు సంభవిస్తూ వచ్చాయి. రోమన్ కాథలిక్కులు చర్చికిపోయే విషయాల లోపల అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. రోమన్లకు కాథలిక్ చర్చి అనేది చాలా ప్రధానమైనది. దీని ఆధిపతికి "బిషప్" అని పేరు పెట్టారు. జెర్మన్ దేశస్థుడైన ఒక సన్యాసి "మార్టిన్ లూథర్" 1517 సం.లో క్రిష్టియన్ మతములో కొన్ని సంస్కరణలు చేసి నూతనమైన మార్గమును అవలంభించాడు. "ఈష్ట్రన్ ఆథరెడ్స్" అని పేరు పెట్టి వారి లోపలకొన్ని విధములైనటువంటి యజమానులను నియమించి అతన్నే “పోప్" అనే రూపుతో ఓక అధికారత్వాన్ని చలాయిస్తూ వచ్చారు. ఒక్క ప్రక్క జీసస్ ప్రభావం దినదినానికి ఆభివృద్ధి కావిస్తూ వచ్చింది. దయ, కరుణ, ప్రేమ, త్యాగం అనే నాలుగు ప్రబోధనలచేత ప్రజల ప్రేమను చూరగొంటూ వస్తున్నాడు. ఈ రోమన్ దేశంలో క్రిస్టియన్ మతం క్రమక్రమేణ పెరుగుతూ వచ్చింది. పూర్వం జీసస్ ఆనేటటువంటి పేరునకు, ఈ క్రీస్తు పేరు లోపల క్రీస్తు అనే పదమునకు ఉండి నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గుర్తింపజేస్తూ వచ్చారు. క్రైస్తు అనగా అభిషక్తుడైనటువాడని అర్థము. అనగా ఎన్నుకోబడినటువంటివాడని. ఈ వ్యమైనటువంటి వ్యక్తిని ఎన్నకోడం చేతనే ఇతనికి ". క్రై స్తు" అని పేరు పెట్టారు. ఇతనిని అనుసరించే వారందరిని క్రైస్తవులన్నారు. అప్పటి రాజైన కాన్ స్టెంటైల్” కూడను ఈ మతమును అధికార మతముగా గుర్తిస్తూ వచ్చాడు. ఈ విధంగా మతం అభివృద్ధి గావటం చేత అనేకమందిలో అసూయభావములు కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి. ప్రతి మతమునందు ఇలాంటివి జరుగుతునే వుంటాయి. వ్యక్తిత్వమనే తత్త్యం అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ విధమైన కలతలు ప్రారంభం కావటం చేతనే మానవత్వంలో వుండినటువంటి దివ్యత్వం క్రమక్రమేణ మాలిన్యం చెందుతూ వచ్చింది. మానవుని యొక్క వాంఛలన్నియు కూడను విషయాలపై ప్రసరింపజేస్తూ వచ్చారు. ఎడారిలో ప్రయాణంచేసే వ్యక్తి దాహం వల్ల ఎండమావులనే నీరని భ్రమించి దాని వెంట పరుగెడుతూ వుంటాడు. క్రమక్రమేణా దారి తప్పి, సమీపించే కొలదీ, అది జలము కాదనే సత్యాన్ని గుర్తించి నిరుత్సాహంలో కృంగిపోతాడు. అదే విధముగనే మానవుడు విషయాసక్తుడై విషయములయందు ఆనందము కలదని విశ్వసించి, దానిని వెంటాడుతూ వెళ్ళి కట్టకడపటికి తన సత్యాన్ని తాను గుర్తించుకొని, నిరాశకు, నిస్పృహకు గురి అవుతూ వస్తుంటాడు. (శ్రీ...92పు.5/8)
"నిజంగా మతాన్ని అర్థం చేసుకున్న వారెవ్వరూ ఒకప్రత్యేకమైన మతాన్ని కాని, ఇతర మతాలను కాని వ్యతిరేకించరు: మోక్షాన్ని కేవలం ఒక్క మార్గం ద్వారా మాత్రమే పొందవచ్చునని కాని, మరే ఇతర మార్గాలు పనికిరావని కాని అనరు. ఏ మతం లో పుట్టినవారూ అయినా, ఏ మార్గాన్ని ఎన్నుకున్నా అన్ని ఆధ్యాత్మిక మార్గాలు నడిపించేది ఒక్క గమ్యం వైపుకే". (స.శి.సు. నా, పు. 71)