భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 1987వ సం||లో ప్రశాంతినిలయంలో వైద్యులు, పశువైద్యుల నుద్దేశించి చేసిన అనుగ్రహభాషణంలో

“గ్రామ సేవలలో వైద్య సేవలు ముఖ్యమైనవి. మూగజీవులకు అందించే సేవలు చాలా అవశ్యమైనవి. కారణం? అవి చెప్పలేవు కనుక. పశు - శిశు వైద్యములు ఒక్కతీరుగానే ఉంటాయి. మనమే గుర్తించి సేవలు అందించాలి. అంతేకాదు. గ్రామీణుల జీవనానికి, వ్యవసాయమునకు అనుబంధముగా పశువులు తమవంతు సాయమందిస్తూ త్యాగనిరతని చాటుకుంటున్నాయి. కనుక, మనము పశువైద్య సేవలను కూడా గ్రామసేవలలో భాగముగా భావించి తగిన సహాయం చేయాలి. సహనం, నిబద్ధత, నేర్పు, ప్రేమ, భక్తిశ్రద్ధలు, సానుభూతి, దయ వంటి సుగుణాలు మీ గ్రామ సేవలలో ప్రతిబింబించాలి. అప్పుడే గ్రామసేవలు రామసేవలుగా మారతాయి. ఇదే గ్రామ సేవల పరమార్ధము. తగినవిధముగా సేవలందించి ఆనందించండి.” (స.సా.స్టె.2019 పు34)